బ్రేకింగ్: నిన్న కత్తి మహేష్,నేడు స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నగర బహిష్కరణ,అజ్ఞాత ప్రదేశానికి తరలింపు?

Paripoornananda Hyderabad Ban

Paripoornananda Hyderabad Ban

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త,శ్రీ పీఠం వ్యవస్థాపకుడు అయినా పరిపూర్ణానంద స్వామి కి పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ విధించినట్లు సమాచారం.. తాజాగా అందుతున్న వార్తల ప్రకారం జూబ్లీహిల్స్‌లో గృహనిర్బంధంలో ఉన్న పరిపూర్ణానందను అదుపులోకి తీసుకుని ఇంటి నుంచి తరలించారు..

అయితే పరిపూర్ణానంద ని ఎక్కడికి తరలించారు అనే విషయంపై ఇప్పటికే స్పష్టత రాలేదు..పోలీసుల కథనం ప్రకారం పరిపూర్ణానంద 2017 లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో స్వామి చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ బహిష్కరణ విధించినట్లు తెలుపుతున్నారు,ఈ బహిష్కరణ ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది,ఆ సమయంలో ఆయన ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకూదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.

ఈరోజు తెల్లవారుజామున పరిపూర్ణానంద నగరం నుంచి తరలించారు,అయితే ఆయనను స్వస్థలమైన కాకినాడుకు తరలిస్తారో.. మరో చోటుకి తరలించారో అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.. పరిపూర్ణానంద స్వామికి నగర బహిష్కరణ నోటీసులు అందినట్లు న్యాయసలహాదారు పద్మారావు కూడా ధృవీకరించినట్లు ఆంధ్రజ్యోతి కధనం తెలిపింది…

రెండు రోజుల క్రితం శ్రీ రాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విమర్శకుడు కత్తి మహేష్ పై కూడా పోలీసులు నగర బహిష్కరణ విధించి చిత్తూరు కి తరలించిన సంగతి తెల్సిందే.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *