వీడియో : “ఆ దర్శకుడితో నాకు పడట్లేదు అంటూ చెప్పడానికి ఈ వీడియో పెడుతున్నా ” అంటూ అఖిల్ అక్కినేని ,సంగతేంటంటే ..

Akhil Director Fight

Akhil Director Fight

యువ దర్శకుడు వెంకీ అట్లూరి తో తనకి గొడవలు వస్తున్నాయన్న వార్తలపై నటుడు అఖిల్ అక్కినేని స్పందించారు,వెంకీ తో కలిసి సంయుక్తంగా ఒక వీడియో విడుదల చేసి ఈ వార్తలపై స్పష్టత ఇచ్చారు అఖిల్..

అఖిల్ సోషల్ మీడియా లో షేర్ చేసిన ఈ వీడియో లో అఖిల్,వెంకీ ఒకేసారి మాట్లాడేందుకు ప్రయతించగా, అఖిల్‌ మధ్యలో ఆగి..‘మీరే కదా డైరెక్టర్‌ మీరు చెప్పండి’ అన్నారు. దానికి వెంకీ స్పందిస్తూ..‘హీరో కదా మీరే చెప్పండి’ అని ఆగారు..


అయితే అఖిల్ అందుకుని “వెంకీకి నాకు క్రియేటివిటీ విషయంలో విభేదాలు వస్తున్నాయట. కానీ తను దర్శకుడు కాబట్టి ఆయన చెప్పిందే నేను చేస్తున్నాను. నాకు ఈయనకు గొడవ జరిగిందని వస్తున్న వార్తలన్నీ నిజమే అని చెప్పడానికి ఈ వీడియో పోస్ట్‌ చేస్తున్నాను.” అంటూ ఘొల్లుమని నవ్వేశారు అఖిల్..

ఆ తర్వాత వెంకీ కి ముద్దు పెట్టడం ద్వారా తమ మధ్యన ఎలాంటి విబేధాలు లేవని చెప్పకనే చెప్పారు అఖిల్ ,2015 లో “అఖిల్”చిత్రం తో తెరంగేట్రం చేసిన అఖిల్,ఆ చిత్ర పరాజయం తర్వాత ,హలో చిత్రం తో మంచి పేరు తెచ్చుకున్నారు.. ఇక వెంకీ అట్లూరి వరుణ్ తేజ్ తో తొలిప్రేమ రూపొందించి మంచి గుర్తింపు సంపాదించారు ..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *