వీడియో : “నేను చనిపోలేదు,బ్రతికే ఉన్నా” ,భారీ యాక్సిడెంట్ నేపథ్యంలో నటి మోనాల్ గజ్జర్ స్పష్టత…

Monal Gajjar Accident

Monal Gajjar Accident

సుడిగాడు,బ్రదర్ అఫ్ బొమ్మాలి చిత్రాల్లో నటించిన నటి మోనాల్ గజ్జర్ తాను బ్రతికే ఉన్నాను అంటూ facebook లైవ్ లోకి వచ్చి నిరూపించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.. ఈ నెల 9 న ఆమె ప్రయాణిస్తున్న టొయోట కారు,ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయినా ఫోటోలు ఆమె సోషల్ మీడియా లో షేర్ చేసారు..

ఈ నేపథ్యంలో మోనాల్ మరణించింది అంటూ సోషల్ మీడియా లో పుకార్లు షికార్లు పుకార్లు చేసాయి,అయితే ఈ పుకార్ల కి చెక్ పెడుతూ ఆమె నిన్న Facebook లైవ్ లోకి వచ్చి స్పష్టతనిచ్చారు,మెడ కి ఒక బ్యాండ్ వేసుకున్న మోనాల్,తనకి తగిలినవి చిన్న గాయాలే అంటూ స్పష్టత ఇచ్చారు..

‘‘హారిబుల్ యాక్సిడెంట్ తర్వాత నేను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను. కొంచెం మెడనొప్పి మినహా అంతా క్షేమం. నన్ను ఒక వారంపాటు రెస్ట్ తీసుకోమన్నారు. అహ్మదాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది’’ అంటూ చెప్పుకొచ్చారు మోనాల్..

అహ్మదాబాద్ కి చెందిన మోనాల్ తెలుగు,తమిళ,గుజరాత్ భాషల్లో కొన్ని చిత్రాల్లో మెరిశారు,తాజాగా ఆమె ఫామిలీ సర్కస్ అనే గుజరాతీ చిత్రం లో నటిస్తున్నారు.. మోనాల్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *