ద్వితీయ వివాహం : పేరు నేరుగా చెప్పకుండా, రేణూ దేశాయ్ నిర్ణయానికి మద్దతు పలికిన పూనమ్ కౌర్.. ఆమె ఎందుకు స్పందించారంటే?

Poonam Kaur on Pawan Kalyan

Poonam Kaur on Pawan Kalyan

పూనమ్ కౌర్ ఈ పంజాబీ భామ చాలా తెలుగు సినిమాల్లో నటించినా కూడా,ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు.. తాజాగా ఆమె బాహుబలి టీమ్ వారు రూపొందిస్తున్న “స్వర్ణ ఖడ్గం” అనే భారీ బడ్జెట్ సీరియల్ లో నటిస్తున్నారు.. అయితే అప్పుడప్పుడు పూనమ్ కౌర్ సోషల్ మీడియా లో యాక్టివ్ అవుతుంటారు,నేరుగా పేరు చెప్పకుండా ఒక ప్రముఖ హీరో ని తన ట్వీట్స్ తో టార్గెట్ చేస్తుంటారు పూనమ్ ..

తాజాగా ఈ ఉదయం సోషల్ మీడియా లో పూనమ్ పెట్టిన ఒక పోస్ట్ చర్చకు దారి తీసింది..ఆమె పెట్టిన ఒక ట్వీట్ లో ఏముందంటే “రెక్కలు గాయపడిన ఒక పక్షికి ఆ గాయాలు మాయమయ్యాయి,ఆ పక్షి ఇప్పుడు ఒక అందమైన ప్రయాణం మొదలు పెట్టనుంది.. ఎటువంటి దుష్ట ఆత్మలు ,నీ ఆలోచనల్లో కూడా రాకుండు గాక.. ఒక మహిళ గా ఉన్నందుకు ఆనందంగా ఉంది..

నువ్వు బ్రతుకుతూ,నలుగుర్ని బ్రతికిస్తూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా– God Bless You ”

ఈ ట్వీట్ లో పూనమ్ నేరుగా ఎవరి పేరు చెప్పుకున్నా కూడా ఈ పోస్ట్ అతి త్వరలో తాను మళ్ళీ వివాహం చేసుకోబోతున్నా అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన రేణూ దేశాయ్ గురించే అని గుసగుసలు మొదలయ్యాయి.పవన్ కళ్యాణ్ తో, పూనమ్ కౌర్ కి ప్రేమ వ్యవహారం ఉంది అని విమర్శకుడు కత్తి మహేష్ గతంలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో పూనమ్ ప్రతీ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి..

అయితే ఎప్పుడూ పూనమ్ ని విమర్శించే పవన్ అభిమానులు మాత్రం,ఈసారి రేణూ పోస్ట్ విషయంలో పూనమ్ కి మద్దతు తెలపడం విశేషం..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *