సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ : షూటింగ్ స్పాట్ లో నటి అనుపమ పరమేశ్వరన్ – నటుడు ప్రకాష్ రాజ్ మధ్యన వివాదం,కళ్ళు తిరిగి పడిపోయిన అనుపమ,వివరాలు..

Prakash Raj Anupama Controversy

Prakash Raj Anupama Controversy

ఏ రంగంలో అయినా సీనియర్స్ -జూనియర్స్ మధ్యన విభేదాలు షరా మాములే,సీనియర్స్ తన అనుభవాన్ని జూనియర్స్ కి బోధించాలి అనే ప్రయత్నంలో ఒక్కోసారి జూనియర్స్ ని నొప్పిస్తూ ఉంటారు,తాజగా అలాంటి సంఘటనే ఒకటి వర్ధమాన నటి అనుపమ పరమేశ్వరన్ ,ఇంకా సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్యలో చోటు చేసుకొంది..

తాజాగా రామ్ హీరో గా వస్తున్న “హలొ గురు ప్రేమ కోసమే” చిత్రంలో వీరిద్దరూ నటిస్తున్నారు,ఒక సన్నివేశంలో భాగంగా ప్రకాష్ రాజ్ ,అనుపమ ని గట్టిదిగా మందలించారని ,అయితే ఆ సంఘటన తో ఒక్కసారిగా ఒత్తిడికి గురై అనుపమ కళ్ళు తిరిగి పడిపోయారని డెక్కన్ క్రానికల్ పత్రిక తెలిపింది..

ఈ సంఘటన పై వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ అనుపమ ని సమీప హాస్పిటల్ కి తరలింపగా ఆమె కోలుకున్నారు,అయితే జరిగిన సంఘటన దృష్ట్యా షూటింగ్ మూడు రోజులు వాయిదా వేసారట..

జరిగిన సంఘటన పై దర్శకుడు త్రినాథ రావు నక్కిన డెక్కన్ తో మాట్లాడుతూ “సీనియర్ నటులు ఎప్పుడూ యువ నటులకి,ఇంకా మంచి నటన ఎలా పండించాలో సలహాలు ఇస్తుంటారు,ఈ సన్నివేశంలో కూడా ప్రకాష్ రాజ్ అనుపమ ని ఇంకా బాగా ఎలా నటించగలరో సలహా ఇచ్చారు అంతే,అయితే ఈ సలహా అనుపమ ని బాధించి ఉండొచ్చు,అయితే అది పెద్ద విషయం కాదు” అన్నారు త్రినాధ్..

ఇక అనుపమ ని ఆసుపత్రి కి తరలించారు అని వస్తున్న వార్తలపై కూడా అయన స్పందించారు,“ఆరోజు ఉదయం నుంచి కూడా అనుపమ నీరసం గా ఉన్నారు,మేము ఆమెను విశ్రాంతి తీసుకొమ్మని చెప్పినా కూడా ఆమె షూటింగ్ లో పాల్గొన్నారు,ఆమెకు Food Poisoning జరగడం తో స్టూడియో లోనే ఒక ఆసుపత్రి కి ఆమె వెళ్లారు,అయితే ఆమె 10 నిమిషాల్లో వెనక్కి వచ్చారు.. ”

ఇక షూటింగ్ రద్దు అవటానికి కారణం ఈ సంఘటన కాదంటూ తెలిపారు త్రినాధ్,”ప్రకాష్ రాజ్ కి ఆ ఒక్క రోజు మాత్రమే డేట్స్ ఉండటం తో ,తర్వాత రోజు షూటింగ్ జరగలేదు.అయితే ఆ తర్వాత ప్రకాష్ రాజ్,అనుపమ ఇద్దరూ మరో సన్నివేశం లో నటించారు.. “

ఈ సంఘటన తర్వాత అనుపమ ప్రకాష్ రాజ్ తో స్నేహపూరితంగా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియా లో షేర్ చేయడం విశేషం,తమ మధ్యన ఎటువంటి గొడవలు లేవని తెలియజేయడం ,చిత్రానికి ఎటువంటి చెడ్డపేరు రాకుండా ఉండటం కోసమే ఆ ఫోటో అనుపమ షేర్ చేసినట్లు భావిస్తున్నారు..

దిల్ రాజు నిర్మాణం లో వస్తున్న “హలొ గురు ప్రేమ కోసమే” చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10 న విడుదల కానుంది..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *