వీడియో : చైతు జీవితంలో చాలా మంది అమ్మాయిలు,అందుకే ఒప్పుకోవడానికి 7 ఏళ్ళు పట్టింది ..చిలసౌ ప్రెస్ మీట్ లో సమంత షాకింగ్ కామెంట్స్..

Samantha on Chaitu Affairs

Samantha on Chaitu Affairs

“ఏం మాయ చేసావే ” తో ప్రేమికులుగా మురిపించి,నిజజీవితంలో భార్యాభర్తలుగా మారిన సమంత -నాగ చైతన్య జంటకి టాలీవుడ్ లో మంచి పాపులారిటీ ఉన్న సంగతి తెల్సిందే.. తాజాగా సుశాంత్ కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న “చిలసౌ” ప్రెస్ మీట్ లో సమంతా “చైతు జీవితంలో చాలా మంది ఉన్నారంటూ,అందుకే తన ప్రేమని ఒప్పుకోవడానికి చైతు కి 7 ఏళ్ళు పట్టిందంటూ” ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు…

మీ ప్రేమకథ గురించి చెప్పండి అంటూ రాహుల్ అడిగిన నేపథ్యంలో నాగ చైతన్య ఇలా మొదలుపెట్టారు ” 7 సంవత్సరాలుగా ఒకరికొకరం తెలుసు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పెళ్లి చేసుకున్నాం. అప్పుడు నాకు సమంత తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు.”

దీనిపై సమంతా స్పందిస్తూ ” బాబూ(చైతూ) నీ గురించి బయట చాలా బ్యాడ్‌గా విన్నాను… అందుకే అంత సమయం తీసుకున్నాను.” అంటూ పంచ్ విసిరారు..

“7 సంవత్సరాలు ఆగకుండా ట్రై చేస్తుంటే,పర్లేదు మంచోడే,అని సమంతా ఛాన్స్ ఇచ్చింది” అని చైతు వ్యాఖ్యానించగా,”పబ్లిక్ గా అబద్ధాలు చెప్తున్నాడు చైతు” అంటూ సామ్ వ్యాఖ్యానించారు..

ఇక సినిమా లో జెస్సి ఒప్పుకోవోడానికి 2 గంటలు పడితే,సామ్ కి 7 ఏళ్ళు పట్టిందా,అని ఆశ్చర్యం వ్యక్తం చేయగా,దీనిపై సమంతా స్పందిస్తూ “నేను చైతూ వెంట మాత్రమే పడ్డాను… కానీ అతడు చాలా మంది అమ్మాయిల వెంట పడ్డాడు …. 7 సంవత్సరాల తర్వాత నా టోకెన్ వచ్చింది.”అంటూ నవ్వుతూ చమత్కరించారు..

అయితే సామ్ వ్యాఖ్యలపై చైతు స్పందిస్తూ “నా జీవితంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారనే విషయం నిజం కాదు. అంత సీన్ లేదు కూడా… సామ్ మసాలా వేసి చెబుతోంది. ఇద్దరం ఇష్ట పడ్డాం. మా రిలేషన్ షిప్‌ను మరో లెవల్‌కి తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాం.” అంటూ ముక్తాయించారు..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *