లైంగిక ఆరోపణలు!శ్రీ రెడ్డి కి షాక్ ఇచ్చిన నటుడు నాని,నోటీసు పంపించేసా అంటూ వార్నింగ్..

Sri Reddy Nani Controversy

Sri Reddy Nani Controversy

కాస్టింగ్ కౌచ్ అంటూ రచ్చ చేసి, గత కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్న నటి శ్రీ రెడ్డి,మరో సరి వార్తల్లోకి ఎక్కారు .. తాజాగా నటుడు నాని పై ఆమె సంచలన ఆరోపణలు చేసారు.. దీనిపై స్పందించిన నాని,శ్రీ రెడ్డి పేరు ఎత్తకుండానే,ఆమెకు లీగల్ నోటీసు పంపించాను,అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు..

నిన్న ఉదయం శ్రీ రెడ్డి సోషల్ మీడియా లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ,”ఆక్సిడెంట్ అయ్యో,కుష్టు రోగం వచ్చో దేవుడు నాశనం చేసెయ్యాలి.. నా భవిష్యత్తుని పోగొట్టినందుకు ఎలా హ్యాపీ గా ఉంటావో చూద్దాం.. మీ భార్య ని లవ్ చేస్తూ ,నాతొ ఎలా పడుకున్నావో ,డ్రగ్స్ లో నీ involvement ఏంటో బయటకి తీద్దాం.. సాయి పల్లవి ఇంకా ఎందరో” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు..

అంతే కాకుండా ఈ ఉదయం నాని ని ఉద్దేశిస్తూ తనకి బిగ్ బాస్ -2 లో ఛాన్స్ రాకపోవడం వెనుక నాని నే కారణం అంటూ మరొక పోస్ట్ పెట్టారు శ్రీ రెడ్డి… “తనతో నాని శృంగారంలో పాల్గొన్నారు అంటూ,అది అబద్దం అయితే తన ఫామిలీ మీద ఒట్టేసిచెప్పాలి” అని పోస్ట్ పెట్టడం సంచలనం అయ్యింది..

అయితే ఈ విషయమై నేరుగా స్పందించని నాని,ఈ సాయంత్రం ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు “స్పందించి నేను బురద లోకి రావాలి అనుకోవట్లేదు.. వాళ్ళకి కావాల్సింది నేను ఇవ్వాలి అనుకోవట్లేదు.. న్యాయ చర్యలు ప్రారంభించా.. పరువునష్టం దావా వేయడానికి నోటీసులు కూడా పంపించా..

ప్రముఖ స్థానాల్లో ఉన్న వ్యక్తులపై బురద జల్లి,లబ్ది పొందాలి అని ప్రయత్నించే వారిని చూస్తుంటే నాకు బాధ కలుగుతుంది.. నా గురించి నేను బాధపడట్లేదు,ఈ సొసైటీ గురించి,మన గురించే నా బాధ..
దురదృష్టం ఏంటంటే ఇలాంటి వాటి గురించి చెప్పాల్సి వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు,ఇక దీని పై ఎప్పుడూ స్పందించను –నాని” అంటూ ట్వీట్ చేశారు..

గతం లో ఇదే విధంగా శ్రీ రెడ్డి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మీద కూడా లైంగిక ఆరోపణలు చేసారు.. అయితే శేఖర్ కమ్ముల ఈ విషయమై స్పందిస్తూ,న్యాయ చర్యలు తీసుకుంటాము అంటూ హెచ్చరించారు …

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *