రాఘవ లారెన్స్ నాతో అసభ్యం గా ప్రవర్తించారు,విశాల్ నన్ను బెదిరించారు.. అంటూ శ్రీ రెడ్డి,తమిళ్ లీక్స్ పేరుతొ సంచలన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు..

Sri Reddy Raghava Lawrence Allegations

Sri Reddy Raghava Lawrence Allegations

నటి శ్రీ రెడ్డి,తన కాస్టింగ్ కౌచ్ ఆరోపణల పరిధిని టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి విస్తరించారు,మొన్న నటుడు శ్రీ కాంత్(శ్రీ రామ్) పై ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి,తాజాగా ఈ అంశంలోకి నటుడు/దర్శకుడు రాఘవ లారెన్స్ ని కూడా లాగారు..

ఒక సినిమా లో ఆఫర్ ఇప్పిస్తాను అంటూ తనతో రాఘవ లారెన్స్ వింతగా,అసభ్యంగా ప్రవర్తించారని,అయితే ఆ వ్యవహారం లో నిర్మాత బెల్లంకొండ విలన్ లా వ్యవహరించారని ఆమె ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.. “‘ఓ రోజు నేను నా స్నేహితుల ద్వారా లారెన్స్‌ మాస్టర్‌ని హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ గోల్కొండ హోటలో కలుసుకున్నాను. ఆ సమయంలో లారెన్స్ తనని తన రూమ్‌కి పిలిపించారు. అక్కడికి వెళ్లాకా రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూసి నాకు చాలా అద్భుతం అనిపించింది. అనంతరం నెమ్మదిగా లారెన్స్ నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చి.. కొత్తగా ఇక్కడికి వచ్చే చాలా మందికి, పేద పిల్లలకి సహాయం అందిస్తున్నానన్నారు.

నాకు అది చాలా మంచిగా అనిపించింది. అ తరువాత లారెన్స్‌ తన నిజస్వరూపం చూపించారు. నా నడుముతో పాటు ఇతర శరీర భాగాలు చూపించమన్నాడు. నాతో అసభ్యంగా డ్యాన్స్ మూమెంట్స్ కూడా చేశాడు. అనంతరం లారెన్స్ తనకు అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో లారెన్స్‌తో కొంత కాలం పాటు స్నేహంగా ఉన్నాను. ఇందులో బెల్లంకొండ సురేష్ చివరికి విలన్ అయ్యారు” అంటూ తెలిపారు శ్రీ రెడ్డి..

తాజాగా ఆమె తనను నటుడు /నడిగర్ సంఘం అధ్యక్షుడు అయిన విశాల్ తనని తమిళ్ లీక్స్ వ్యవహారం లో బెదిరిస్తున్నారు అని కూడా ఆరోపించారు… “నటుడు విశాల్ నుంచి నాకు బెదిరింపులు వస్తున్నాయి ,అయితే నేను తమిళ్ లీక్స్ బయటపెట్టకుండా వదలను” అంటూ శ్రీ రెడ్డి పేర్కొన్నారు..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *