తమిళానికి శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ సెగ : తెలుగు/తమిళ నటుడు శ్రీ కాంత్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి,ప్రముఖ దర్శకుడి పై కూడా ..

Srikanth Sri Reddy Leaks

Srikanth Sri Reddy Leaks

కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో తెలుగు సినిమా పరిశ్రమలో మినీ సునామీ నే సృష్టించిన నటి శ్రీ రెడ్డి ,తాజాగా తమిళ పరిశ్రమ పై కూడా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు మొదలుపెట్టారు,
తెలుగు /తమిళ బాషా నటుడు శ్రీకాంత్ (నటుడు శ్రీ రామ్,తన పేరుని శ్రీకాంత్ గా మార్చుకున్నారు) పై తాజాగా ఆమె ఆరోపణలు ఎక్కుపెట్టారు.

తాజాగా సోషల్ మీడియా లో ఆమె ఒక పోస్ట్ షేర్ చేసారు,అందులో “ఐదేళ్ల క్రితం హైదరాబాద్ పార్క్ హోటల్ లో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పార్టీ నీకు గుర్తుందనే అనుకుంటున్నా,ఆరోజు నువ్వు నాతో చేసిన ఆ పని నాకు బాగా నచ్చింది.. అయితే ఆ రోజు మనమిద్దరం కల్సి డాన్స్ చేస్తున్నపుడు నువ్ నాకు సినిమా ఛాన్స్ ఇస్తాను అని చెప్పావ్ ,నీకు గుర్తుందా?” అంటూ పోస్ట్ పెట్టారు శ్రీ రెడ్డి.

తెలుగు వాడైనా శ్రీకాంత్,మొదట రోజాపువ్వు సినిమా తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ..అయితే ఆ తర్వాత ఏవో కొద్దీ సినిమాలు హిట్ అయినా,తర్వాత ఎందుకో పెద్ద విజయాలు చూడలేదు .. తెలుగు లో ఒకరికి ఒకరు లాంటి హిట్ సినిమా చేసిన కూడా శ్రీకాంత్ కొద్దీ రోజులుగా తెలుగు తెర పై పెద్దగా కనిపించడం లేదు.

తమిళం లో అయన అరకొర సినిమాలు చేస్తూనే ఉన్న,తెలుగు ప్రేక్షకులు మాత్రం 2012 లో వచ్చిన స్నేహితుడు సినిమా లో విజయ్ మిత్ర బృందం లో ఒకరిగా చూసారు అంతే.. మరి అటువంటి అరకొర పాత్రలు చేస్తున్న నటుడు,శ్రీ రెడ్డి కి ఆఫర్ ఇస్తాను అని మాట ఇవ్వడం ఏంటి అనేది అర్ధం కాదు ..

శ్రీకాంత్ పైనే కాకుండా శ్రీ రెడ్డి అగ్ర తమిళ దర్శకుడు మురుగదాస్ పై కూడా ఆరోపణలు చేసారు,”హాయ్ మురుగదాస్ గారు ఎలా ఉన్నారు?మనం గ్రీన్ పార్క్ హోటల్ లో కలిసాం గుర్తుందా?వెలిగొండ శ్రీనివాస్ ద్వారా మనం కలిసాం,మీరు నాకు ఆఫర్ ఇస్తాము అని చెప్పారు,కానీ మనం చాలా.. అయితే ఇప్పటివరకూ మీరు నాకు ఆఫర్ ఇవ్వలేదు,మీరు గొప్పవాళ్ళు సర్” అని పోస్ట్ పెట్టారు..

శ్రీ రెడ్డి గతంలో ఇలాంటి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు తెలుగు దర్శకులు/నటుల పై చేసిన సంగతి తెల్సిందే,అయితే శ్రీ రెడ్డి ఇలాంటి ఆరోపణలు దర్శకుడు శేఖర్ కమ్ముల పై చేయగా అయన లీగల్ నోటీసు ఇస్తాను అంటూ హెచ్చరిక జారీ చేసా రు,ఇక నటుడు నాని అయితే ఆమెకు లీగల్ నోటీసు లు జారీ చేసాం అని ప్రకటించారు కూడా .. ఏది ఏమైనా శ్రీ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గకపోవడం విశేషం..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *