ట్రాఫిక్ నిబంధనలు పాటించట్లేదా? యమరాజు వచ్చేస్తాడు జాగ్రత్త,బెంగళూరు ట్రాఫిక్ లో సందడి చేసిన యముడు,సంగతేంటంటే..

Yamaraj Bengaluru Traffic

Yamaraj Bengaluru Traffic

ఈరోజుల్లో కెమెరాలు,పోలీసుల తనిఖీలు ఎన్ని పెరిగినా రోడ్డు పైన ట్రాఫిక్ సెన్స్ లేకుండా వాహనాలు నడిపే వాళ్ళ సంఖ్య తక్కవేమీ కాదు,ఐ టి నగరం బెంగళూరు లో ఈ సంఖ్య మరీ ఎక్కువ,అయితే ఇలా నిబంధనలు పాటించని వారికి చుక్కలు చూపించడానికి నేనున్నా అంటూ యమధర్మ రాజు వచ్చేసాడు..

నిన్న బెంగళూరు లో ఒక పెద్ద గద పట్టుకుని నిబంధనలను పాటించని వారిని తరుముతూ ,కొంత మందికి గులాబీలు పంచుతూ సందడి చేసాడు యముడి వేషంలో ఉన్న ఒక వ్యక్తి.. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకి అవగాహన కల్పించడం కోసం పోలీసులు ఈ వినూత్న పంధా ని ఎన్నుకున్నారు…

“సాధారణంగా నిబంధనలు అతిక్రమించే వాళ్ళు జరిమానా చెల్లించి,తాము అతిక్రమించిన నిబంధన విషయం మర్చిపోతారు,అయితే వారు ఈ యముడి చేతికి చిక్కితే మాత్రం ఎప్పటికి మర్చిపోరు” అంటూ ఈ విషయమై వ్యాఖ్యానించారు ఒక స్థానిక ట్రాఫిక్ పోలీసు అధికారి..

పోలీసులు ఈ యముడు పాత్రధారితో ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కలిగించడం కోసం వీధి నాటకాలు ప్రదర్శింపచేసారు,ప్రజలు ఈ యముడి కి ఆకర్షితులై సెల్ఫీలు తీసుకోవడం విశేషం.. ఈ యముడు పాత్రధారి నిబంధనలను పాటించని వారిని తరుముతూ,కొందరికి గులాబీలు పంచుతూ సందడి చేసారు..

ఈ యముడి పాత్రధారి గా ఈరేష్ అనే స్థానిక నాటక కళాకారుడు అలరించారు.. ఈ విషయమై తాను చాలా సంతోషంగా ఉన్నన్ని,ఉదయం నుంచి నిబంధనలు పాటించని 80 మందికి గులాబీలు పంచానని,ఇక రోజు కి ఎంత మంది నిబంధనలు పాటించడం లేదో అని ఆయన వ్యాఖ్యానించారు.. . ‘హెల్మెట్ ధరించకూడా వాహనాలు నడిపే వారి జీవితం ప్రమాదం లో ఉన్నట్లే,మద్యం సేవించి వాహనాలను నడపకండి , హెల్మెట్ ధరించండి యమధర్మరాజను మీ జీవితాల్లోకి ఆహ్వానించకండి..’ అంటూ ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేసారు ఈరేష్..

ఇప్పటికీ జుట్టు ఊడిపోతుంది అంటూ హెల్మెట్ ధరించని యువతీ యువకులు ఈ యముడైనా భయపెట్టి వారితో హెల్మెట్ ధరింపచేస్తాడేమో మరి చూద్దాం..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *