కొంచెం ఓపిక పట్టాలి.. తప్పదు: తన తదుపరి చిత్రం పై అభిమానులకి ఆసక్తికర సందేశం పంపిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..

Allu Arjun Next Movie Updates

Allu Arjun Next Movie Updates

నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా విడుదలై 3 నెలలు కావొస్తున్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరొక చిత్రానికి సైన్ చేయకపోవడం పై అభిమానులు గుర్రుగా ఉన్నారు.. కొద్ది రోజుల క్రితం బన్నీ తర్వాత ప్రాజెక్ట్ 24 ఫేమ్ విక్రమ్ కే కుమార్ తో ఉంటుంది అని వార్తలు వెలువడ్డా,ఎందుకో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు..దానితో బన్నీ తరువాత చిత్రం పై సందిగ్దత నెలకొంది ..

అయితే ఈ విషయమై బన్నీ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.. “నా ప్రియమైన అభిమానులారా,మీ ప్రేమకు నా కృతజ్ఞతలు..నా తదుపరి సినిమా ప్రకటన కోసం, మీరు కొద్దిగా ఓపికగా ఉండాలని నేను ఆశిస్తున్నా,ఎందుకంటే ఆ ప్రకటన కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది..

ఒక మంచి సినిమాని మీకు అందించాలనేది నా తాపత్రయం,అయితే ఇది కొద్దిగా సమయం తీసుకునే అవకాశం ఉంది.. అర్ధం చేసుకున్నందుకు థాంక్స్.. ” అంటూ సందేశాన్ని ఉంచారు బన్నీ.

2016 లో వచ్చిన సరైనోడు తర్వాత,బన్నీ నటించిన దువ్వాడ జగన్నాధం,నా పేరు సూర్య,నా ఇల్లు ఇండియా ఆశించిన స్థాయి లో విజయవంతం కాకపోవడంతో బన్నీ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.. చూద్దాం స్టైలిష్ స్టార్,ఈ సరి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని ఆశిద్దాం..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *