షాకింగ్ : సీనియర్ నటి అన్నపూర్ణ ఇంట విషాదం,ఆమె కుమార్తె కీర్తి ఆత్మహత్య ..

Annapurna Daughter Death

Annapurna Daughter Death

ప్రముఖ నటి అన్నపూర్ణ ఇంట విషాదం నెలకొంది,ఈ తెల్లవారుజామున ఆమె కుమార్తె కీర్తి ఆత్మహత్య చేసుకున్నారు.. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఒక అపార్ట్మెంట్ లో ఈ ఉదయం కీర్తి ఈ ఘోరానికి పాల్పడ్డారు..

ఈ ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు తెలియరాలేదు,అయితే కీర్తి కుమార్తె కు మాటలు సరిగ్గా రాకపోవడం తో కీర్తి ఆందోళన చెందినట్లు,కొద్ది రోజులుగా ఈ విషయమై ఆమె బాధపడుతున్నట్లు అన్నపూర్ణ మీడియా కి తెలిపినట్లు ఏ బీ యెన్ తెలిపింది.. తాను కీర్తికి సర్ది చెప్పాలని చూసానని ,అయితే ఇదే విషయమై ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అన్నపూర్ణ తెలిపారు..

కీర్తి కూతురుకు సరిగా మాటలు రావడం లేదు. గత కొద్ది రోజులుగా పాపకి స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నాము. పాపకు ఇక మాటలు రావను కొని కొద్ది రోజులుగా ఢిఫ్రెషన్‌లోకి వెళ్ళింది. పాప కు ఏమి కాదు అని ధైర్యం చెప్పి కీర్తికి కౌన్సెలింగ్ ఇస్తున్నాము. ఈ రోజు తెల్లవారుజామున బెడ్ రూమ్ డోర్ తీయక పోవడంతో అనుమానం వచ్చి డోర్ పగులగొట్టి లోనికి వెళ్లి చూస్తే… ఉరి వేసుకొని కనిపించింది

అని తెలిపారు అన్నపూర్ణ.
కీర్తికి 2013 లో వివాహం అయింది,అయితే కొద్దిరోజులుగా ఆమె భర్త తో విడిగా ఉంటున్నట్లు తెల్సింది,ప్రస్తుతం ఆమె భర్త బెంగళూరు లో నివసిస్తుండగా,కీర్తి అన్నపూర్ణ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ప్రక్కనే మరొక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. ఇక కీర్తి మృత దేహాన్ని స్వాధీన పరుచుకున్న పోలీసులు,వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు,వైద్య పరీక్షలు నిర్వహించాకా అన్నపూర్ణ కి మృత దేహాన్ని అప్పగించే అవకాశం ఉంది..

తెలుగు సినిమాల్లో అగ్రనటులైన ఎన్ టీ ఆర్ ,ఏ ఎన్ ఆర్ నుంచి చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్,ఇంకా నేటి తరం హీరోలు ఎందరికో అన్నపూర్ణ అమ్మ పాత్రల్లో నటించి మెప్పించారు.. ఈ విషాదాన్ని ఎదురుకోవడానికి అన్నపూర్ణ గారికి శక్తిని ప్రసాదించాలని ప్రార్థిద్దాం..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *