మునిగిపోతున్న కమలం,తగ్గిపోతున్న మోడీ హవా.. 2019 లో సగానికి పడిపోనున్న భాజపా సీట్లు,కలకలం రేపుతున్న అంతర్గత సర్వే..

BJP Internal Survey Results

ఉపఎన్నికల్లో వరుస పరాజయాలతో బేజారెత్తిపోయిన భాజపా కి ఒక తాజా సర్వే ఫలితాలు మరింత బీపీ పెంచుతున్నట్లు సమాచారం.. తాజగా ప్రముఖ హిందీ దినపత్రిక “దైనిక్ జాగరణ్” ప్రచురించిన ఒక భాజపా అంతర్గత సర్వే,భాజపా కి 2019 ఎన్నికల్లో హిందీ రాష్ట్రాల్లో భారీగా ఎంపీ సీట్లు కోల్పోతున్నట్లు చెప్పింది ..

ఆ పత్రిక ప్రకటించిన సర్వే వివరాల ప్రకారం,ఎన్నికలు జరిగితే భాజపా గత ఎన్నికల్లో గెలుచుకున్న 282 సీట్ల లో ,152 సీట్లు పైగా కోల్పోతున్నట్లు చెప్తుంది .. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ పార్టీ గెలుచుకున్న రెండు ఎంపీ సీట్లు కూడా ఈసారి కోల్పోతున్నట్లు సమాచారం..

ఈ సర్వే చూసి షాక్ అయిన మోడీ-షా ద్వయం,తాజాగా నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు తెల్సింది.. తాజాగా తమకి గుడ్ బై చెప్పిన శివసేన అధినేత తో షా భేటీ వెనుక కూడా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయని అంటున్నారు,ఇంకా షా,మోడీ ద్వయం అద్వానీ,జోషి లాంటి పార్టీ పెద్దలని మచ్చిక చేస్కునే ప్రయత్నం వెనుక కూడా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయని టాక్..

దీంతో పార్టీ అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బంగా రాష్ట్రాలపై దృష్టిసారించేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో మొత్తం 105 సీట్లు ఉండగా గత ఎన్నికల్లో భాజపా కేవలం ఆరు స్థానాలను మాత్రమే గెలవడం గమనార్హం.
ఒడిశా,ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భాజపా తన సీట్లు పెంచుకునేందుకు షా ఇప్పటికే ఆలోచనలు ప్రారంభించినట్లు సమాచారం.. అయితే ప్రత్యేక హోదా పై చేసిన మోసం తో భాజపా అంటేనే ఇంతెత్తున లేస్తున్న ఆంధ్ర ప్రజలని కమలనాధులు ఎలా బుజ్జగిస్తారు అనేది వేచి చూడాలి..

Source : https://www.bhaskar.com/union-territory/chandigarh/news/latest-chandigarh-news-030503-1917611.html

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *