సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైకాపా ఎం ఎల్ ఏ ,నందమూరి హరికృష్ణ ఫోటోలు,జూనియర్ NTR వైకాపా కి మద్దతిస్తారా అంటూ చర్చలు..

Harikrishna YCP Interest

Harikrishna YCP Interest

నందమూరి కుటుంబసభ్యులు పార్టీ తెలుగు దేశం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు,అయితే తాజాగా తాను నందమూరి హరికృష్ణ గారిని కలిసాను అంటూ ఒక వైకాపా ఎం ఎల్ ఏ షేర్ చేసిన ఒక ఫోటో ఇపుడు సోషల్ మీడియా లో ఆసక్తికర చర్చలు దారి తీసింది..

వివరాల్లోకి వెళ్తే వైకాపా కి చెందిన గుడివాడ ఎం ఎల్ ఏ కొడాలి నాని కి ,జూనియర్ ఎన్ టీ ఆర్ తో మంచి స్నేహం ఉన్న సంగతి తెల్సిందే,టీడీపీ లో ఉండి రెండుసార్లు ఎం ఎల్ ఏ గా గెలిచిన నాని తదనంతర పరిణామాల్లో వైకాపా లో చేరారు ,2014 ఎన్నికల్లో అయన వైకాపా తరపున గెలుపొందారు.. అయితే రాజకీయాలు ఎలా ఉన్నా కోడలి జూనియర్ కుటుంబం తో మంచి సంబంధాలు పాటిస్తున్నారు..

తాజాగా సోషల్ మీడియా లో హరికృష్ణ ని కలిసిన ఒక ఫోటో షేర్ చేసారు,”గురువు నందమూరి హరి కృష్ణ గారితో ఆత్మీయ కలయిక..” అని పేరు పెట్టుకున్న ఆ ఫోటోలు ఎదో ఫంక్షన్ లో తీసినట్లుగా ఉన్నాయి.. అయితే నాని ఈ ఫోటో షేర్ చేయగానే,హరికృష్ణ,జూనియర్ వైకాపా కి మద్దతిస్తారా అన్న చర్చ మళ్ళీ ఊపిరి పోసుకుంది..

ఈ విషయమై ఇప్పటికిప్పుడు ఎవరూ నోరు మెదపకపోయినా జూనియర్ అభిమానులు మాత్రం,తమ హీరో కట్టె కాలేవరకూ తెలుగు దేశంలోనే ఉంటారని,2012 లో ఆయన టీవీ చానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ని ఉటంకిస్తున్నారు.. ప్రస్తుతానికి తాను సినిమాల పై మాత్రమే దృష్టిపెట్టాను అని చెప్తున్నా జూనియర్,రాజకీయాల పై మాట్లాడడానికి ఆసక్తి చూపడం లేదు..

ప్రస్తుతానికి అయితే మాత్రం జూనియర్ రాజకీయాలపై మౌనం వహిస్తున్నారు,పూర్తిగా తన ప్రోజెక్టుల తో బిజీ అయిపోయారు ఆయన.. అయితే 2019 లో కూడా జూనియర్,హరి కృష్ణ ఇలా తటస్తంగానే ఉంటారా,లేదంటే తెలుగు దేశం తరుపున ప్రచారం చేస్తారా?లేదంటే వైకాపా కి మద్దతిస్తారా అనేది ఆసక్తికరం..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *