వీడియో : “ఒక్క రోజు రైతులా బ్రతికి చూడు..”, ఈ ఒక్క సీన్ చాలు , కార్తీ “చిన్న బాబు” రైతులు తలెత్తుకుని చూసే చిత్రం అని చెప్పడానికి..

Chinna Babu Sneak Peek Video

Chinna Babu Sneak Peek Video

కార్తీ తెలుగు,తమిళ భాషల్లో రైతు గా నటిస్తున్న చిన్నబాబు చిత్రం ఈ నెల 13 వ విడుదల కానుంది,తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ కోసం చిత్రం లోని మూడున్నర నిముషాల వ్యవధి గల ఒక సన్నివేశాన్ని చిత్ర బృందం విడుదల చేసింది..

ఈ సన్నివేశం లో భాగంగా ఒక కూరలు అమ్మే వృద్ధురాలు ఆగకుండా వెళ్ళిపోయిన ఒక బస్సు గురించి తిట్టుకుంటుండగా ,కార్తీ ఎడ్లబండి తో ఆ బస్సు ని ఛేజ్ చేసి మరీ ఆ బస్సు ని ఆపి “ఒక్క రోజు రైతు గా ఉండి చూడు,లేదంటే రైతు తో ఉండి చూడు” అంటూ ఆ బస్సు కండక్టర్ కళ్ళు తెరిపిస్తాడు.. ఈ సన్నివేశంలో రైతుల కష్టాన్ని ఎంతో గొప్పగా చెప్పారు కార్తీ..

పాండిరాజ్ దర్శకత్వం లో వస్తున్న చిన్నబాబు లో ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబపెద్ద పాత్ర పోషిస్తున్నారు,సయేషా సైగల్,కథానాయికగా వస్తున్న ఈ చిత్రం ,ఉమ్మడి కుటుంబాలు,రైతుల సమస్యల నేపథ్యంలో రూపొందనుంది..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *