కామన్ మాన్ కాదట : చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ,ఆయనొక లాబీయిస్టు .. కేంద్ర ప్రభుత్వ పోస్టులకి 50 లక్షలు,రాష్ట్రానికైతే 1 కోటి,బిగ్ బాస్ నూతన నాయుడు పై సంచలన ఆరోపణలు…

BiggBoss Nuthan Naidu Allegations

BiggBoss Nuthan Naidu Allegations

కామన్ మ్యాన్ కేటగిరీ లో బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు పై ఒక టీవీ షో సాక్షిగా సంచలన ఆరోపణలు చేసారు శివ అనే వ్యక్తి.. నూతన్ అసలు పేరు నూతన్ నాయుడు కాదని నూతన్ కుమార్ అని ,అయన చుట్టూ ఎప్పుడూ ప్రత్యేకంగా సెక్యూరిటీ ఉంటుందని అలంటి వ్యక్తి కామన్ మ్యాన్ ఎలా అవుతాడంటూ శివ ఆరోపించారు..

ఈ సందర్భంగా అదే టీవీ షోలో నూతన్ నాయుడు మాట్లాడిన ఫోన్ రికార్డింగ్స్ వినిపించారు,నూతన్ ఆ కాల్ లో తనకి ప్రధాన మంత్రి కార్యాలయంలో OSD తెలుసనీ,కాబట్టి కేంద్ర ప్రభుత్వ నామినేటేడ్ పోస్ట్లు కావాలంటే,50-70 లక్షలు చెల్లించాలని,అదే విధంగా రాష్ట్ర నామినేటెడ్ పోస్ట్లు కావాలంటే 1 కోటి అవుతుందని తెలిపారు నూతన్ ..

తనకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ,సృజన చౌదరి,పరకాల ప్రభాకర్ ఇంకా భువనేశ్వరి,లోకేష్,బ్రాహ్మణి ల తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని ఆ కాల్ లో తెలిపారు నూతన్.. అంతే కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టిస్తాను అని నూతన్ తన సోదరుడి వద్ద 3 కోట్లు తీస్కున్నారని వాపోయారు శివ..

“సంవత్సరం పాటు అతని చుట్టూ తిరిగా ,అయినా కూడా అతను నాకు దొరకలేదు..” మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ షో లో చేస్తున్నారని తెలిసిందని అయన అన్నారు,ఇప్పుడు నూతన్ పై తాము కేసు పెడుతున్నామని,ఎలాగైనా నూతన్ ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి రప్పిస్తామని కూడా తెలిపారు శివ..

ఇప్పుడు కూడా రాజకీయ లబ్ది కోసమే నూతన్ బిగ్ బాస్ షో లోకి వెళ్లారు అని తెలిపారు శివ.. మరి శివ ఆరోపణలపై నూతన్ ఏమంటారో వేచి చూడాల్సిందే..

Related Posts

3 thoughts on “కామన్ మాన్ కాదట : చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ,ఆయనొక లాబీయిస్టు .. కేంద్ర ప్రభుత్వ పోస్టులకి 50 లక్షలు,రాష్ట్రానికైతే 1 కోటి,బిగ్ బాస్ నూతన నాయుడు పై సంచలన ఆరోపణలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *