వీడియో : బాబా కాదు “బాబోయ్” అనాలి : ఒంటి మీద 20 కేజీ ల నగలు,రోలెక్స్ వాచ్ తో యాత్ర చేస్తున్న గోల్డెన్ బాబా .. ఎక్కడంటే ..

Golden Baba

Golden Baba

సాధారణంగా సన్యాసులు అంటే సర్వ సంఘ పరిత్యాగులు అని చెప్పుకుంటారు,అయితే ఢిల్లీ కి చెందిన గోల్డెన్ బాబా గా పేరొందిన సుధీర్ మక్కర్ అనే ఆయన గురించి తెలుసుకుంటే ఆ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు.. ప్రతి ఏడాది “కన్వర్ యాత్ర” (ప్రముఖ శైవ క్షేత్రాల సందర్శనం) చేసే గోల్డెన్ బాబా ఈ ఏడాది ఏకంగా 20 కిలోల బంగారు ఆభరణాలు ధరించి యాత్ర చేయడం సంచలనం రేపింది.

మార్కెట్ ధర ప్రకారం బాబా ధరించిన ఆభరణాల విలువ ఆరు కోట్ల రూపాయలుగా చెప్తున్నారు,2016 లో ఇదే బాబా 12 కేజీలు,2017 లో 14.5 కేజీలు ఉండగా,ఈ ఏడాది ఏకంగా 20 కేజీలకి పెరగడం విశేషం.. 2017 లో బాబా ధరించిన ఆభరణాల లో 21 బంగారు చైన్లు,21 దేవుడి ప్రతిమలు ,ఇంకా రకరకాల ఆభరణాలతో పాటు ఒక బంగారు జాకెట్ కూడా ఉన్నది ,అయితే ఇది బాబా తన కారు పైన ప్రయాణిస్తూ ప్రజలకి అభివాదం చేసేటప్పుడు మాత్రమే ధరించేవారట..

ఈయన గతంలో ధరించిన ఒక్కో బంగారు చైన్ రెండు కేజీలు అని తెలిపారు.. “నేను ఈ దఫా యాత్ర లో పెద్దగా బంగారం ధరించలేదు,ఎందుకంటే ఆ బరువు నా మెడ నరాలపై ఒత్తిడి పెంచి,నా చూపు పై కూడా ప్రభావం చూపింది” అని తెలిపారు..

బంగారం తో పాటుగా బాబా దగ్గర 27 లక్షలు విలువ చేసే రోలెక్స్ వాచ్,ఒక BMW,3 Fortuners, 2 ఆడీ,2 ఇన్నోవా వాహనాలు కూడా ఆయన కాన్వాయ్ లో భాగం అని చెప్తున్నారు.. ఇవి కాకుండా ఆయన హుమ్మర్,జాగ్వార్,ల్యాండ్ రోవర్ లని కూడా అద్దెకు తెచ్చేవారట..

సన్యాసి గా మారకముందు గోల్డెన్ బాబా ఢిల్లీ లో బట్టల దుకాణం నడిపేవారట!”నా జీవితాన్ని ప్లాటుఫారమ్ పై బట్టలు అమ్మడం తో ప్రారంభించా,అయితే శివ దేవుడి ఆశీస్సుల తో ,బిట్టు అనే పేరుతొ టి షర్ట్స్ ,జీన్స్ అమ్మడం ప్రారంభించి వ్యాపారం లో వృద్ధి సాధించా,అయితే ఆ తర్వాత నా జీవితాన్ని శివ దేవుడికి అంకితం ఇచ్చా” అని తన పూర్వాశ్రమం గురించి తెలిపారు బాబా..

“బంగారం,కార్లు పై నా మక్కువ ఎప్పటికీ పోదు,నేను చనిపోయే ముందు ఇవి నా ప్రియతమ శిష్యుడికి అందజేస్తా” అని తెలిపారు బాబా..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *