వీడియో : వడపప్పు,పానకంతో ఒళ్ళు పెంచావ్,శ్రీ రాముడినే దూషిస్తావా?కత్తి మహేష్ పై నిప్పులు చెరుగుతూ హైపర్ ఆది..

Hyper Aadi Vs Kathi Mahesh

Hyper Aadi Vs Kathi Mahesh

శ్రీ రాముడి పై అనుచిత వ్యాఖ్యలతో హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరణ కి గురైన విమర్శకుడు కత్తి మహేష్ పై ఆగ్రహ జ్వాలలు ఇంకా మండుతూనే ఉన్నాయి,తాజాగా అయన ప్రత్యర్థి ,జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది,మహేష్ వ్యాఖ్యల పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేసారు..

శ్రీ రాముడి పై కొంత మంది చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఆది ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.. “ఒకడేమో రాముడు దేవుడు కాదంటారు,ఇంకొకడేమో ఆయన దశరథుడికి పుట్టలేదంటాడు.. ఇంకొకడు దగుల్బాజీ ఇలా రక రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఛీ.. ఛీ.. ఛీ.. ఎరా.. శ్రీరామ నవమికి పెట్టే వడపప్పు, పానకం తిని ఒళ్లు పెంచినట్లున్నావా.. ఎలా వచ్చాయిరా నీకు ఆ మాటలు” అంటూ మహేష్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు..

తనకి హిందూ,ముస్లిం,క్రిస్టియన్ ఇలా అన్ని మతాల వారు స్నేహితులే అంటూ,తాను అన్ని ప్రార్ధన మందిరాలకు నమస్కరిస్తాను ,ఇలా ఐకమత్యంగా ఉండే మన దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆది వాపోయారు..

ఒకప్పుడు కేవలం సినిమాల మీద రివ్యూ లు రాసె వ్యక్తులు ఇప్పుడు స్వార్ధం కోసం దేవుడిని కూడా రివ్యూ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆది వ్యాఖ్యానించారు “ఒకప్పుడు వీళ్ళు సినిమాల మీద రివ్యూలు రాసేవాళ్ళు,ఇప్పుడు దేవుళ్ళ మీద కూడా రివ్యూలు ఇస్తున్నారు,దానితో ప్రజలని మా దేవుడు,మా దేవుడు అంటూ కొట్టుకుని చచ్చేలా చేస్తారేమో వీళ్లంతా” అన్నారు ఆది..

ఇక మహేష్ లాంటి వారికి మద్ధతు ఇస్తున్న వారికి కూడా చురకలు అంటించారు ఆది.. “మీలో చాలా మంది బిజీ గా ఉండొచ్చు,అయితే ఒక తప్పు ని ఖండించలేనంత బిజీ కాదనే నేను అనుకుంటున్నా,దయచేసి మహేష్ లాంటి వారికి మద్దతు ఇవ్వకండి” అంటూ ముగించారు ఆది..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *