వీడియో : NTR Biopic లో నటిస్తున్నారా అని అడిగిన రిపోర్టర్ కి షాక్ ఇచ్చిన జూ ఎన్ టీ ఆర్ ,ఏమన్నారంటే..

Jr NTR on NTR Biopic

Jr NTR on NTR Biopic

“సెలెక్ట్ మొబైల్స్” అనే నూతన బ్రాండ్ కి ప్రచారకర్త గా ప్రముఖ హీరో జూనియర్ ఎన్ టీ ఆర్ ,నిన్న ఆ బ్రాండ్ కి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్,ఎన్ టీ ఆర్ బయోపిక్ లో నటిస్తున్నారా అని అడిగిన రిపోర్టర్ కి షాక్ ఇచ్చే ఆన్సర్ ఇచ్చారు..

“మీరు ఇదే ప్రశ్న నన్ను మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు?ఈ ప్రశ్నకి సమాధానం నేను గతం లో IPL Promotions లో ఉండగానే ఇచ్చాను కదా,ఆ జవాబుకే నేను కట్టుబడి ఉన్నా,మళ్ళీ మళ్ళీ ఆ జవాబు చెప్పదలుచుకోలేదు.. ” అంటూ ప్రశ్నని తోసిపుచ్చే ప్రయత్నం చేసారు జూనియర్ ..

అయితే మళ్ళీ మళ్ళీ అడిగి ప్రశ్నకు సమాధానం చేపట్టే ప్రయత్నం రిపోర్టర్ చేయగా,”ఒకసారి గతం లోకి వెళ్ళండి,నా ఇంటర్వ్యూ rewind చేసి చూడండి ,మీకు అక్కడ నా సమాధానం లభిస్తుంది..మీరు చూడండి,క్లియర్ గా ఉంటుంది అక్కడ నా సమాధానం,మీకు అర్ధమైతే అర్ధమైనట్లు,చాలా మందికి అర్ధమైంది,మీకు ఇంకా అర్ధం కాలేదంటే ఒక్కసారి rewind నొక్కేస్తే తెలిసిపోతుంది ” అంటూ రిపోర్టర్ కి నవ్వుతూనే చురకలంటించారు తారక్..

ఇక తాను మొట్టమొదటి ఫోన్ హైదరాబాద్ లోని జగదీశ్ మార్కెట్ లో(తక్కువ ధరకి మొబైల్స్ లభించే చోటు) కొన్నానని,ఈరోజుల్లో ఫోన్ వాడకుండా ఉండటం కష్టం అని,అందులోనూ ఇద్దరు పిల్లల తండ్రిగా బాధ్యత మరింత పెరిగిందని,ఫోన్ లేకుండా ఉండటం అసాధ్యం అని బదులిచ్చారు తారక్.

ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న NTR Biopic లో నందమూరి బాలకృష్ణ ఎన్ టీ ఆర్ పాత్ర ని పోషిస్తుండగా,విద్యా బాలన్ బసవ తారకం పాత్రలో మెరవనున్నారు.. ఇలా LV ప్రసాద్ పాత్రలో బెంగాలీ నటుడు జిష్ణు సేన్ గుప్త,నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా,నాగి రెడ్డి పాత్రలో ప్రకాష్ రాజ్,చక్రపాణి పాత్రలో మురళి శర్మ,BA సుబ్బారావు పాత్రలో సీనియర్ నటుడు నరేష్ ఇప్పటి వరకు ఎంపికయ్యారు.. ఈ చిత్రం 2019 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *