మా ఊరి నుంచి వెళ్లిపోండి.. కత్తి మహేష్ కి షాక్, నగర బహిష్కరణ విధించిన హైదరాబాద్ నగర పోలీసులు..ఆంధ్ర పోలీసులు ఏమి చేయబోతున్నారు?

Kathi Mahesh Hyderabad Ban

Kathi Mahesh Hyderabad Ban

ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది,హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ,కత్తి మహేష్ కి నగర బహిష్కరణ విధిస్తూ నోటీసు జారీ చేసారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. వార్తా ఛానెల్స్ అందిస్తున్న సమాచారం ప్రకారం గత రాత్రి కత్తి మహేష్ కి పోలీసులు నోటీసులు అందజేసినట్లు సమాచారం..

పోలీసులు అందజేసిన నోటీసులో మహేష్ తమ అనుమతి లేకుండా హైదరాబాద్‌కు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది.

అయితే మహా న్యూస్ మాత్రం మహేష్ ప్రస్తుతం స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు లో ఉన్నారని,హైదరాబాద్ లో అయన బహిష్కరణకు గురైన నేపథ్యంలో,ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఈ విషయంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఆయన్ని ఆంధ్ర లో కూడా బహిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలిపింది,ఇదే కనుక జరిగితే మహేష్,ఆంధ్ర,తెలంగాణ కాకుండా మహేష్ వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది..

TV 5 లో తన మార్కు సినీ విశ్లేషణలతో వెలుగులోకి వచ్చిన మహేష్,ఆ తర్వాత బిగ్ బాస్ షో తో మరింత పాపులారిటీ పెంచుకున్నారు,అయితే అనూహ్యంగా పవన్ అభిమానులతో గొడవ పడి సుమారుగా 4 నెలల పాటు ఒక మినీ యుద్ధాన్నీ తలపించే డిబేట్స్ టీవీ చానెల్స్ లైవ్ షో ల ద్వారా ఆయన జరపడం గమనార్హం..

గత నెలలో జరిగిన ఒక టీవీ షో లో శ్రీ రాముడి పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తాజా నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు.. ఈ విషయమై కొద్దీ సేపట్లో అక్కడి పోలీసులు ఒక అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *