వీడియో : భక్తితో శ్రీ రామ శ్లోకం ఆలపించి షాకిచ్చిన మహేష్ కత్తి,క్షమించేసా అంటూ స్వామి పరిపూర్ణానంద..

Kathi Mahesh Vs Paripoornananda

Kathi Mahesh Vs Paripoornananda

శ్రీ రాముని పై అనుచిత వ్యాఖ్యలు చేసి హైదరాబాద్ నగర బహిష్కరణ కి గురైన మహేష్ కత్తి, తాజాగా స్వరం మార్చారు,శ్రీ రాముని పై “శ్రీ రాఘవం” అనే శ్లోకాన్ని అద్భుతంగా ఆలపించి సోషల్ మీడియా లో ఒక వీడియో పోస్ట్ చేసారు..

ఈ వీడియో అసలు నిజంగా అయన శ్రీరాముని పై తన అభిప్రాయాలు మార్చుకుని చేసారో,లేదంటే ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక చేసారో తెలియకపోయినా కూడా,తాజాగా హైదరాబాద్ నగర బహిష్కరణ ఎదుర్కొన్న స్వామి పరిపూర్ణానంద మాత్రం సంతోషాన్ని వెళ్లబుచ్చారు.. మహేష్ కత్తి లో తాను వాల్మీకి గా మారిన బోయవాడి ని చూస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు..

“కత్తి మహేష్‌ను నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. మహేష్ బోయవాడిగా మాట్లాడినా.. వాల్మీకిగా మారగల శక్తి తనకు ఉంది” అని పరిపూర్ణానంద మహేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అతి త్వరలోనే రామనామం గొప్పతనాన్ని కత్తి మహేష్‌ గుర్తిస్తారని అయన వ్యాఖ్యానించారు..

అలాగే భారత సంస్కృతిని ప్రభుత్వమే రక్షించాలని.. హిందూ సంప్రదాయాలను, విలువలను తెలిపే విధంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చోటుచేసుకోవాలని పరిపూర్ణానంద అభిప్రాయపడ్డారు.

ఇక కత్తి మహేష్ కూడా స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ ను ఖండించారు.. “పరిపూర్ణానంద నగర బహిష్కరణను ఖండిస్తున్నాను. బహిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం కాదు.బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.మనుషుల్ని “తప్పిస్తే” సమస్యలు తప్పుతాయి అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుంది.” అంటూ మహేష్ ఒక పోస్ట్ లో తెలిపారు..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *