వృద్ధుడి గెటప్ లో కింగ్ నాగార్జున,సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఫోటో ..పక్కన ఆ పాప ఎవరు? ఏ సినిమా కోసం??

Nagarjuna Old Man Getup

Nagarjuna Old Man Getup

వయసు 60 కి దగ్గర పడినా ఎప్పుడూ తన మొహం లో కానీ,చురుకుదనంలో కానీ వృద్ధాప్యపు ఛాయలు కనపడనివ్వరు నాగ్,అయన సినిమాల్లో కూడా ఎప్పుడూ వృద్ధుడి పాత్రలు చేసింది లేదు..అయితే తాజాగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఒక ఫోటో లో ,నాగ్ పండు ముసలి గెటప్ లో,ఒక చిన్నారి పాప తో సెల్ఫీ దిగారు..

ఈ ఫోటో నాగ్ -నాని మల్టీ స్టారర్ చిత్రం దేవదాస్ నుంచి అని మొదట భావించారు అభిమానులు,అయితే అదేమీ కాదని ఇది కళ్యాణ్ జెవెలర్స్ వారి యాడ్ షూట్ లో భాగంగా తీసిన ఫోటో అని చెప్తున్నారు,నాగ్ ప్రక్కనున్న ఆ బాలిక మలయాళ పరిశ్రమ కి చెందిన బాలనటి మీనాక్షి.. “ఎవరో చెప్పుకోండి చూద్దాం” అంటూ మీనాక్షి సోషల్ మీడియా లో ఈ ఫోటో ని షేర్ చేసారు..దానితో ఇక ఈ ఫోటో పై వస్తున్న రూమర్స్ కి తెర పడినట్లే..

శమంతకమణి చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య,ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెల్సిందే,ఈ చిత్రం లో నాని ఒక డాక్టర్ పాత్ర పోషిస్తుండగా,నాగార్జున ఒక డాన్ పాత్రలో మెరవనున్నారని సమాచారం..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *