“పగిలిపోద్ది” అంటూ నటుడు ఆదర్శ్ బాలకృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన ఎన్ టీ ఆర్ అభిమానులు,ఎందుకంటే..

NTR Fans Vs Aadarsh Balakrishna

NTR Fans Vs Aadarsh Balakrishna

నటుడు ఆదర్శ్ బాలకృష్ణ పై జూనియర్ ఎన్ టీ ఆర్ అభిమానులు సోషల్ మీడియా లో విరుచుకుపడ్డారు.. సోషల్ మీడియా లో జూనియర్ ,ఇంకా త్రివిక్రమ్ తో కలిసి ఆదర్శ్ షేర్ చేసిన ఒక ఫోటో ఈ రచ్చ కి కారణమైంది..
ఎన్ టీ ఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో “అరవింద సామెత” అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెల్సిందే,తాజాగా ఈ సినిమా లో నటిస్తున్న ఆదర్శ్ బాలకృష్ణ తాను త్రివిక్రమ్,ఇంకా ఎన్ టీ ఆర్ తో కలిసి తీసుకున్న ఫోటో ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ” ఈ ఆదివారం నాకు చాలా చాలా ప్రత్యేకం..ఇది కామియో(అతిధి పాత్ర) అయినా కూడా జూనియర్ ఎన్ టీ ఆర్ ఇంకా త్రివిక్రమ్ సర్ తో పనిచేయడం అనే నా కల మాత్రం నెరవేరింది “అన్నారు..

అయితే ఆదర్శ్ త్రివిక్రమ్ ని మాత్రమే సర్ అని సంభోదిస్తూ,ఎన్ టీ ఆర్ ని ఏకవచనం తో సంభోదించడంతో ఎన్ టీ ఆర్ అభిమానులు ఆగ్రహం చెందారు..దీనితో ఆదర్శ్ ని ఆగ్రహం తో దూషిస్తూ కొందరు,మందలిస్తూ కొందరు ట్వీట్స్ పెట్టారు అభిమానులు ..

“బొ* పగిలిపోద్ది.. ఆయన్ని NTR సర్ లేదా ఎన్టీఆర్ గారు అని పిలువు ” అని ఒక అభిమాని పోస్ట్ పెట్టగా,మరొక అభిమాని “తారక్ అన్న మా దైవం,ఆయనకి నువ్వు ధైర్యం ఇచ్చి తీరాలి” అని మరొక అభిమాని మందలించారు..

అయితే ఇంత రచ్చలో కూడా కొందరు అభిమానులు “తారక్ ,ఆదర్శ్ ఒక వయసు వాళ్ళు కావడం వాళ్ళ అలా అని ఉండొచ్చు,ఇంకా ఈ విషయాన్నీ వదిలెయ్యండి” అంటూ వ్యాఖ్యానించారు..ఇక ఈ విషయంపై ఆదర్శ్ మాత్రం పెదవి విప్పలేదు..

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదర్శ్ కేవలం ఎన్టీఆర్ ని టాగ్ చేసారు,అంతే తప్ప మర్యాద లేకుండా సంభోదించలేదు.. మరి అభిమానులకి ఇంత కోపం ఎందుకు వచ్చింది అనేది అర్ధం కానీ విషయం.. ఏది ఏమైనా అభిమానులు ఈ అతి తగ్గించుకుంటే,తమ హీరో కీర్తి ని మరింత పెంచినవారు అవుతారేమో..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *