Franklin Templeton ఒక వ్యక్తి అంటూ కామెంట్ !జనసేనాని కి స్పీచ్ లు రాస్తుంది ఎవరు?

Pawan Kalyan Franklin Templeton Comments

Pawan Kalyan Franklin Templeton Comments

ఈరోజుల్లో రాజకీయ నాయకుడి ప్రతి కదలిక ని ఎంతో జాగ్రత్తగా గమనిస్తున్నారు అభిమానులు,మరీ ముఖ్యంగా ప్రత్యర్ధులు..గతంలో ఒకసారి “వర్ధంతి” కి బదులుగా “జయంతి” అంటూ నోరుజారి సోషల్ మీడియా లో Trolling బారిన పడ్డ ఎపి ఐ టి మంత్రి ,మాదిరిగా ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నోరు జారి సోషల్ మీడియా లో నవ్వులపాలయ్యారు..

ఇక అసలు విషయానికి వస్తే తాజాగా బస్సు(కారు) యాత్ర లో భాగంగా విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న జనసేనాని రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.. “ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తికి ఎకరం 30 లక్షలకి ఇచ్చింది ఈ ప్రభుత్వం, వాళ్లేమో 15CRకి అమ్ముకుంటున్నారు ” అని సంచలన వ్యాఖ్యలు చేసారు.. అయితే ఆరోపణలు చేయడంలో ఉన్న శ్రద్ధ పవన్ పదాల అమరిక పై పెట్టకపోవడంతో నవ్వులపాలయ్యారు..

ఇకపోతే Franklin Templeton అనేది ఒక వ్యక్తి కాదని,అదొక ఆస్తుల నిర్వహణ సంస్థ అని,పైగా ఆ సంస్థ నెలకొల్పి 80 సంవత్సరాలు దాటింది,అని జనసేనాని విస్మరించడం ముఖ్యవిషయం.. పవన్ ఈ అమాయకపు ఆరోపణలు మరోసారి తెలుగు తమ్ముళ్ళకి సరదా ని పంచాయి.. దానితో వారు రకరకాలుగా కామెంట్స్ పెడుతూ సోషల్ మీడియా లో పవన్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు..

అయితే పవన్ తన ఆవేశపూరిత ప్రసంగాల్లో నోరు జారడం(tongue slip) ఇదేమీ తొలిసారి కాదు..ఈ మార్చ్ లో జనసేన వార్షికోత్సవ సభలో మాట్లాడుతూ ఐ టి మంత్రి లోకేష్ భారీ గా అవినీతి చేసారంటూ ఆవేశపూరిత ప్రసంగం చేసారు.. ఈ విషయమై విలేకరులు పవన్ ని ప్రశ్నించగా “నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు,ఎవరో అనుకుంటుంటే విన్నాను” అనడం ఒక రాజకీయ నాయకుడిగా అయన విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసింది ..

క్రొత్త తరహా రాజకీయం చేస్తాం అంటూ రాజకీయ రంగంలోకి దూకిన జనసేన ఇలాంటి గాలి మాటలు ,పుకార్లు,తో ప్రజలకి ఏమి సందేశం ఇవ్వబోతుందో మరి వారికే తెలియాలి..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *