కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు : పెదవి విప్పిన రాఘవ లారెన్స్,కోపం లేదు,ప్రెస్ మీట్ పెడతా,నటించి చూపిస్తే ఛాన్స్ ఇస్తా,సవాల్ విసిరిన లారెన్స్..

Raghava Lawrence on Sri Reddy

Raghava Lawrence on Sri Reddy

అవకాశాలు ఇస్తాను అంటూ తనని లైంగికంగా ఉపయోగించుకున్నారు అంటూ తనపై నటి శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలపై నటుడు/దర్శకుడు రాఘవ లారెన్స్ ఎట్టకేలకు మౌనం వీడారు.. నిన్న ఈ విషయమై ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు..

నటి శ్రీ రెడ్డి విషయమై తాను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అని అయన తెలిపారు “అసలు శ్రీ రెడ్డి ఇష్యూ నాకు ఒక సమస్యే కాదు,స్పందించకూడదు ,అనుకున్నా ,కానీ పత్రికల వారు ,పదే పదే ఈ విషయమై నా స్పందన అడగటం తో నేను స్పందిస్తున్నా ,శ్రీ రెడ్డి తాను నన్ను “రెబెల్” షూటింగ్ లో కలిశానని చెప్తున్నారు,ఆ సినిమా వచ్చి 7 ఏళ్ళు అయ్యింది,ఒక వేళ నేను ఏదైనా తప్పు చేసుంటే అప్పుడే ఆమె ఎందుకు నాపై ఫిర్యాదు చేయలేదు?” అంటూ ప్రశ్నించారు లారెన్స్..

ఇక తాను లారెన్స్ ని ఒక హోటల్ లో కలిసానని శ్రీ రెడ్డి చెప్పటం పట్ల కూడా లారెన్స్ స్పందించారు,”ఆమె నన్ను ఒక హోటల్ గదిలో కలిస్తే,నేను ఆమెని లైంగికంగా ఉపయోగించుకున్నాను అని చెప్తున్నారు,అంతే కాకుండా నా గదిలో ఒక రుద్రాక్ష,దేవుడి పటాలు కూడా ఉన్నట్లు ఆమె చెప్తుంది,హోటల్ గదిలో దేవుడి పటాలు,రుద్రాక్ష ఉంచి పూజ చేయడానికి నేనేమైనా పిచ్చోడినా?” అంటూ ఎదురు ప్రశ్నించారు ..

శ్రీ రెడ్డి కి సవాల్ విసురుతూ “నేను తప్పు చేసానో లేదో ఆ భగవంతునికే తెలుసు,శ్రీ రెడ్డి నేను నీకు నేరుగా చెపుతున్నా,నీ మీద నాకేమీ కోపం లేదు,నీ ఇంటర్వ్యూ లు అన్నీ చూసాకా నీ మీద నాకు జైలు వేస్తుంది,అసలు నీ సమస్య ఏంటి? నీకు అవకాశాలు ఇస్తామని నిన్ను వంచించి ,లైంగికంగా వాడుకున్నారు అంటున్నవ్ అంతేనా?కాబట్టి నేను నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా,నేను ఒక ప్రెస్ మీట్ పెడతా,నువ్వు ఆ ప్రెస్ మీట్ కి నీ మిత్రులు,లేదా శ్రేయోభిలాషులు తో హాజరు కా,నీకు నేను నటించడానికి ఒక చిన్న సన్నివేశం,ఒక డ్యాన్స్ స్టెప్ ఇస్తా,అలాగని నీకు భారీ సన్నివేశాలు కానీ స్టెప్స్ కానీ ఇవ్వను,ఒక నటి చేయగలిగిన అతి సాధారణ సన్నివేశాలే ఇస్తా,నువ్వు బాగా చేస్తే,ప్రెస్ ముందే నీకు నా సినిమా లో ఛాన్స్
ప్రకటించి,అడ్వాన్స్ కూడా ఇస్తా ” అంటూ ఆఫర్ ఇచ్చారు లారెన్స్..

అంతే కాకుండా తాను ఎటువంటి తప్పు చేయలేదని,కాబట్టి తనకి శ్రీ రెడ్డి ని ఎదురుకోవడానికి ఎటు వంటి భయం లేదని ఈ సందర్భంగా లారెన్స్ తెలిపారు.. “ఈ సమాధానం నేను నీకు భయపడి ఇవ్వట్లేదు,స్త్రీ ల పట్ల నాకు ఉన్న గౌరవ భావం తో ఇస్తున్నా,మా అమ్మకి గుడి కట్టించేటంత గౌరవ భావం ఉంది నాకు స్త్రీల పట్ల ,మంచి విషయాలు మాట్లాడదాం,మంచి పనులు చేద్దాం,నీకు మంచి జీవితం రావాలని నేను ప్రార్థిస్తున్నా” అంటూ ముగించారు లారెన్స్..

అయితే లారెన్స్ నిన్న మధ్యాహ్నం ఉంచిన ఈ పోస్ట్ పై ఇప్పటివరకూ శ్రీ రెడ్డి స్పందించలేదు,మరి ఆమె లారెన్స్ సవాల్ ని అంగీకరించి ,యాక్టింగ్ ఛాన్స్ తెచ్చుకుంటారా లేదా అనేది వేచి చూడల్సిన అంశమే..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *