“పవన్ తో నా విడాకులకు ముందే పవన్ మూడవ భార్య గర్భవతి” అంటూ రేణు దేశాయ్ వివరణ,ఎలాగంటే…

Renu Desai On Polina Birth

Renu Desai On Polina Birth

చూస్తుంటే పవన్ కళ్యాణ్ అభిమానుల ట్రోలింగ్ ని ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ సీరియస్ గా తీసుకున్నారు అనిపిస్తుంది..తాజాగా కొద్ది రోజుల క్రితం ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పవన్ విడాకులకు ముందే వేరే భార్య ని గర్భవతి ని చేసారు అని ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ని ట్రోల్ చేస్తున్న అభిమానులకి ఆమె ఒక వివరణ ఇచ్చారు..

పోలినా అనే పాప పుట్టింది 2013 సంవత్సరం లో అయితే,విడాకుల నాటికే పవన్ వేరే భార్య తో తండ్రి అవ్వడం ఏంటి అని అభిమానుల ట్రోల్ల్స్ కి ఆమె వివరణ ఇచ్చారు.. విడాకుల నాటికీ పవన్ వేరే భార్య గర్భవతి గా ఉందంటూ ఆమె తెలిపారు..

“బేబీ పోలినా పుట్టింది 13 మార్చి 2012. [9 నెలలు అంటే గర్భధారణ అయ్యింది జులై 2011]. విడాకులు ఖరారు అయినది పాప పుట్టిన తరువాత అంటే 16 మార్చి 2012. ఈ వివరణ ఎందుకంటే గత కొన్నిరోజులుగా మాకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి, స్వప్న గారితో రేణు గారి ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని పాప పుట్టిన తేదీ మరియు విడాకులు మీద కొంతమంది గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.

రేణు గారికి పాప పుట్టిన విషయం ఆమెకు తెలిసిన తరువాత శుభాకాంక్షలు తెలిపారు, ఈ విషయాన్నే RK గారి ఇంటర్వ్యూలో ఆమె తెలియజేశారు. రేణు గారికి శిశువు గర్భం దాల్చిన విషయం తెలియదు, ఈ విషయాన్నే ఆవిడ స్వప్న గారితో ఇంటర్వ్యూ లో చెప్పారు. ఆవిడ PR టీం గా మేము ఈ వివరాలను తెలియచేసి, ఆమె అబద్దం చెప్పారన్న గందరగోళాన్ని తొలిగించడానికే ఈ పోస్ట్. Thank you” అంటూ తన PR ద్వారా వివరణ ఇచ్చారు రేణూ..

విడాకులు అయినా దాదాపు 6 ఏళ్ళకి రేణూ ద్వితీయ వివాహం చేసుకోనున్నారు,అయితే భద్రతా కారణాల దృష్ట్యా తనకి కాబోయే భర్త వివరాలని గోప్యంగా ఉంచారు రేణూ..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *