వచ్చే నెలలో తిరుమల వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే ఒక్క క్షణం ఇది మీ కోసమే..

Tirumala Temple Darshan Restrictions

Tirumala Temple Darshan Restrictions

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించి తరించాలనేది ప్రతి తెలుగు వాడి కోరిక,రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా జాతీయ /అంతర్జాతీయ వ్యాప్తంగా భక్తులు వేంకటేశ్వరుని దర్శనం కోసం లక్షలాది సంఖ్యలో విచ్చేస్తుంటారు,ఇక ఆగష్టు నెల,శ్రావణ మాసం అంటే ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది,అయితే తాజాగా వచ్చే నెల లో తిరుమల ని సందర్శించే భక్తులకి షాక్ ఇచ్చే వార్త తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం ..

12 ఏళ్ళకి ఒకసారి నిర్వహించే మహాసంప్రోక్షణ లో భాగం గా ఆగష్టు 9 నుంచి17 వరకు 9 రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ.. మహాసంప్రోక్షణ పై చర్చించిన పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది…

ఈ విషయమై ఆగమ పండితుల సూచన మేరకు ఆగస్టు 12 నుంచి 16 వరకు అష్టబంధన, బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం 11న మహా సంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. 9వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకు కొండపైకి భక్తుల రాకను నిలిపివేస్తున్నట్టు సభ్యులు ప్రకటించారు..

మహాసంప్రోక్షణ జరిగేటప్పుడు ఎవరూ మూలమూర్తి ని దర్శించుకోలేరు.స్వామి వారి ఆవాహన చేసిన కలశాల తో పాటు,అప్పుడు ప్రత్యేకంగా చేసిన స్వామి వారి బాలాలయం లోని మూర్తి ని మాత్రమే దర్శించుకోవడానికి వీలవుతుంది,అది కూడా రోజులో కొద్దీ గంటలు మాత్రమే సాధ్యం. ఈ నేపథ్యంలో లక్షలాది భక్తులకి ఈ బాలాలయం లో దర్శనం ఇవ్వడం అనేది సాధ్యం కానీ పనికాబట్టి ,ఈ 9 రోజుల పాటు ఇక్కడ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది..
అయితే తొమ్మిది రోజులు పాటు కొండపైకి భక్తుల రాకపోకలని నిషేధించడంపై భక్తులు ఆగ్రహం చేయడంతో ఈ విషయంపై మాత్రం టీటీడీ వెనక్కి తగ్గినట్లు తెలిసింది.. కొండపైకి వచ్చే అన్ని మార్గాలను తెరచి ఉంచుతామన్న పాలకమండలి దర్శనంపై మాత్రం ఆంక్షలు అమలవుతున్నాయని తెలిపింది.

కాబట్టి మీరు వచ్చే నెలలో తిరుమల ని సందర్శించే ఆలోచనలో ఉంటె మాత్రం,ఆ నిర్ణయాన్ని ఆగష్టు 9-17 కి కొద్దిగా ముందుకు గానీ వెనుకకుగా గానీ జరుపుకోవటం శ్రేయస్కరం..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *