నేడు ప్రారంభం కానున్న నాని బిగ్ బాస్ -2 లో పాల్గొనబోయే 16 మంది లిస్ట్ ఇదిగో..

Bigg Boss Telugu 2 Contestants

Bigg Boss Telugu 2 Contestants

నాచురల్ స్టార్ నాని టీవీ హోస్ట్ గా పరిచయం కానున్న నేటి బిగ్ బాస్ సీజన్-2 లో పాల్గొనబోయే వారి లిస్ట్ స్టార్ మా వారు ఇప్పటికీ ప్రకటించకపోయినా,సోషల్ మీడియా లో మాత్రం 16 మందితో కూడిన లిస్ట్ ఒకటి బయటకి వచ్చేసింది.. ఆ వివరాలు మీకోసం అందిస్తున్నాం..

కంటెస్టెంట్ 1 : గీతా మాధురి

ప్రముఖ టాలీవుడ్ గాయని గీతా మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నటుడు నందు ని వివాహం చేసుకున్న ఈమె,టీవీ షో లలో ఎంత సరదాగా ఉంటారో చూసే ఉంటారు.. సరిగ్గా అదే జోష్ ఈ బిగ్ బాస్ లో గీత మాధురి చూపిస్తారేమో వేచి చూడాల్సిందే..

కంటెస్టెంట్ 2 : బాబు గోగినేని

జనవిజ్ఞాన వేదిక కన్వీనర్ బాబు గోగినేని ఎక్కువగా వార్త చానెల్స్ డిబేట్లలో కనిపిస్తూ ఉంటారు.. సమాజంలో మూఢనమ్మకాలను ఈయన తన వాగ్ధాటితో చీల్చి చెండాడడం టీవీ ల లో అప్పుడప్పుడూ కనిపించేదే.. మరి అలంటి బాబు గోగినేని ఈ బిగ్ బాస్ షో లో ఏమి చేయబోతున్నారు అనేది ఆసక్తికరం..

కంటెస్టెంట్ 3 : అమిత్ తివారి

పలు సినిమాలలో విలన్/సహాయ నటుడి గా నటించి మనల్ని భయపెట్టిన అమిత్ తివారి ఈసారి బిగ్ బాస్ షో లో కనిపించబోతున్నారట.. మరి 16 మంది కంటెస్టెంట్స్ తో ఈయన ఎంత రచ్చ చేయబోతున్నారో చూడాల్సిందే..

కంటెస్టెంట్ 4 : దీప్తి వాజపాయ్

సీనియర్ టీవీ 9 యాంకర్ దీప్తి వాజపాయ్ కూడా ఈసారి బిగ్ బాస్ షో లో కనిపిస్తారట,తన ప్రశ్నలతో సెలెబ్రిటీలని ఇరుకున పెట్టె దీప్తి ఈసారి అదే సెలబ్రిటీస్ తో ఒకే హౌస్ లో 100 రోజులు గడపడం ఆసక్తికరమే..

కంటెస్టెంట్ 5 : నటుడు తనీష్

బాల నటుడిగా కెరీర్ మొదలెట్టి,నచ్చావులే తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తనీష్,ఈసారి బిగ్ బాస్ లో భాగం కానున్నారట.. ఈమధ్యన డ్రగ్స్ కేసులో ఈయన పేరు విన్పించిన సంగతి తెల్సిందే ,మరి బిగ్ బాస్ లో ఈయన తన సహచరులతో ఎలా ఉంటారో చూడాల్సిందే..

కంటెస్టెంట్ 6 : రోల్ రిదా (రాప్ సింగర్)

రోల్ రిదా గా పేరున్న ప్రముఖ రాప్ సింగర్ రాహుల్ ఈసారి బిగ్ బాస్ లో భాగం కానున్నారట .. ఒక ప్రముఖ software సంస్థ లో క్వాలిటీ అనలిస్ట్ గా పని చేస్తూ,రాప్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు రోల్ రిదా..
కంటెస్టెంట్ 7 : శ్యామల(యాంకర్)

ప్రముఖ యాంకర్ శ్యామల ఈసారి బిగ్ బాస్ లో మెరవబోతున్నారట.. నటి గా కెరీర్ మొదలెట్టి,యాంకర్ గా కూడా మంచి షోస్ చేసిన శ్యామల ,రెండేళ్ల క్రితం వివాహం చేస్కుని ,షోస్ తగ్గించిన సంగతి తెల్సిందే..
కంటెస్టెంట్ 8 : కిరీటి దామరాజు

టాలీవుడ్ సహాయనటుడు కిరీటి దామరాజు కూడా బిగ్ బాస్ లో భాగం కానున్నారు.. కిరీటి ఈమధ్యనే రామ్ “ఉన్నదీ ఒకటే జిందగీ” లో రామ్ మిత్రునిగా మెరిశారు.
కంటెస్టెంట్ 9 : కౌశల్(నటుడు)

మరో టాలీవుడ్ సహాయనటుడు కౌశల్ మంద కూడా బిగ్ బాస్ లో భాగం కానున్నారు..
కంటెస్టెంట్ 10 : దీప్తి సునైనా(డబ్ మాష్ స్టార్)

Instagram లో తన డబ్ మాష్ ల తో సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకున్న దీప్తి సునైన కూడా ఈసారి బిగ్ బాస్ లో భాగం కానున్నారు
కంటెస్టెంట్ 11 : తేజస్వి మదివాడ (నటి)

ఐస్ క్రీం ఫేమ్ తేజస్వీ మదివాడ కూడా ఈసారి బిగ్ బాస్ లో మెరవనున్నారు ..
కంటెస్టెంట్ 12 : సామ్రాట్ రెడ్డి(నటుడు)

పంచాక్షరీ ఫెమ్ సామ్రాట్ కూడా ఈసారి బిగ్ బాస్ లో భాగం కానున్నారు.. ఈయన తాజాగా భార్య కేసు పెట్టడంతో మీడియా లైమ్ లైట్ లోకి వచ్చిన సంగతి తెల్సిందే..
వీరు కాకుండా భాను అనే మరో నటి,ఇంకా కామన్ మాన్ క్యాటగిరి లో గణేష్,సంజన,నూతన్ నాయుడు అనే మరో నలుగురు కూడా ఈసారి బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నారు అని సమాచారం.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 నేటి రాత్రి 9 గంటల నుంచి,స్టార్ మా లో ప్రారంభం కానున్న సంగతి తెల్సిందే ..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *