ఇక నుంచి జనసేన పార్టీ ఛానల్ గా 99 టీవీ ? కొత్త యాజమాన్యం చేతుల్లోకి 99 టీవీ,పూర్తి వివరాలు..

Janasena 99 TV Channel

Janasena 99 TV Channel

కొన్ని నెలల క్రితం శ్రీ రెడ్డి సంఘటన లో కొన్ని తెలుగు వార్తా ఛానెల్స్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక మినీ యుద్ధాన్నే నడిపిన సంగతి తెల్సిందే,తన పరువు తియ్యటానికి ముఖ్యంగా TV 9,TV 5,ABN కుట్రకి తెర లేపేయంటూ అప్పట్లో పవన్ ఆరోపించారు,అయితే తదనంతర పరిణామాల్లో మొదట నెత్తి మీద పెట్టుకున్న మీడియా పవన్ చేస్తున్న ఉత్తరాంధ్ర పర్యటన ప్రాధాన్యతను తగ్గించాయి..

బహుశా అందుకేనేమో జనసేన తమ కోసం ఒక వార్తా ఛానల్ అవసరాన్ని భావించి తాజాగా 99 టీవీ ని కొనుగోలు చేసిందని అంటున్నారు.. కొద్దీ రోజులుగా ఆర్ధిక ఇబ్బందులతో సతమతవుతున్న 99 టీవీ అనే ఛానల్ ని ,New Waves Media అనే సంస్థ చేజిక్కించుకొంది.. ఈరోజు ఉదయం 99 టీవీ క్రొత్త యాజమాన్యంతో జనసేన కార్యదర్శి తోట చంద్రశేఖర్,ఇంకా మహేందర్ రెడ్డి మొదలైన జనసేన కీలక నేతలు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు..

తాజగా ఈ విషయమై జనసేన అభిమానులు 99 టీవీ తమ ఛానల్ అంటూ సోషల్ మీడియా లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఆ ఛానల్ కి యూ ట్యూబ్ లో subscribe చేసుకోవాలంటూ సందేశాలు పంపుతున్నారు… ఒక్కరోజులోనే ఆ ఛానల్ 2 లక్షల subscribers కూడా సొంతం చేసుకున్నట్లు చెప్తున్నారు..

రాజకీయ పార్టీలకి సొంత మీడియా సంస్థలు ఉండటం క్రొత్త ఏమి కాదు,తమిళనాడు లో DMK కి సన్ టీవీ ఉండగా,AIADMK కి జయ టీవీ ఉన్నాయి.. అయితే అధికారికంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక పార్టీ కోసం పెట్టిన ఛానల్ అంటే సాక్షి అనే చెప్పుకోవాలి.. అప్పట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ తమ ప్రభుత్వ పధకాలను ప్రజలకి ప్రచారం చేసే నెపం తో సాక్షి ఆరంభించారు.. సాక్షి తప్ప అధికారికంగా ఒక పార్టీ కి మద్దతు పలికే ఛానల్ ఆంధ్ర ప్రదేశ్ లో లేదు,అయితే తాజాగా ఈ లిస్ట్ లో 99 టీవీ చేరనుంది..

ఇక ఈ ఛానల్ ఒకటే కాకుండా జనసేన చూపు 10 టీవీ అనే వార్తా ఛానెల్ మీద కూడా ఉందని సమాచారం.. ఆ ఛానల్ యాజమాన్యంతో జరుగుతున్న చర్చలు సఫలీకృతం అయితే 10 టీవీ కూడా వారి ఖాతా లో చేరే అవకాశం లేకపోలేదు..

అయితే యూ ట్యూబ్,సోషల్ మీడియా,వాట్స్ యాప్ మొదలైన ప్రచార సాధనాలు విరివిగా ఉన్న ఈరోజుల్లో ,ఒక టీవీ ఛానల్ పెట్టడం అంటే చాలా రిస్క్ గానే పరిగణించాలి.. సాక్షి మాదిరిగా ఎప్పుడో వైకాపా బాజా మోగిస్తూ ,టీడీపీ వ్యతిరేక వార్తలు రాస్తారో,లేదంటే తమ దగ్గర ఉన్న పాజిటివ్ పాయింట్స్ చెప్పుకోవడం కోసం ఈ 99 ఛానల్ ని ఉపయోగిస్తారో వేచి చూడాల్సిందే..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *